
టోక్యో ఒలింపిక్స్‌లో భారత్ పోటీపడుతున్న క్రీడాంశాలు ఈ రోజుతో ముగియనున్నాయి. ఇప్పటివరకు వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో మీరాబాయి చాను, రెజ్లింగ్‌లో రవికుమార్ దహియాలకు రజత పతకాలు, బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్‌లో పీవీ.సింధుకి కాంస్య పతకం, పురుషుల హాకీ జట్టు, మహిళల బాక్సింగ్ విభాగంలో లోవ్లీనా బోర్గోహైన్‌లకు కాంస్య పతకాలు లభించాయి. కాగా ఈరోజు భారత్‌కు మరిన్ని పతకాలు వచ్చే అవకాశాలున్నాయి.
జావలిన్ త్రో ఆటగాడు నీరజ్ చోప్రా క్వాలిఫికేషన్ రౌండ్‌లోనే నిర్దేశిత దూరం త్రో విసిరి మొదటి స్థానంలో నిలిచాడు. దీంతో అతను ఫైనల్లోకి అడుగు పెట్టి పతకంపై గురి పెట్టాడు. ఇక రెజ్లింగ్ విభాగంలో బజరంగ్ పూనియా కాంస్య పతకం కోసం పోటీ పడుతున్నాడు. అలాగే భారత గోల్ఫ్ క్రీడాకారిణి అదితి అశోక్ నిన్న జరిగిన గోల్ఫ్ పోటీలో రెండో స్థానంలో నిలవడంతో ఆమె కూడా పతకం సాధించే అవకాశం కనిపిస్తోంది. టోక్యోలో కొన్ని ప్రాంతాల్లో వర్షం పడుతుండగా మరో ప్రాంతంలో ఎండ తీవ్రత ఎక్కువగా ఉంది. ఈరోజు వాతావరణం అనుకూలించక పోతే గోల్ఫ్ పోటీలో రెండో స్థానంలో నిలిచినందుకు అదితికి పతకం వచ్చే అవకాశం ఉంటుంది.
టోక్యో ఒలింపిక్స్‌లో భారత్ ఈరోజు పోటీపడే క్రీడాంశాలు:
జావలిన్ త్రో : నీరజ్ చోప్రా ( భారత్ కాలమాన ప్రకారం మధ్యాహ్నం 4:30 గంటల నుండి)
రెజ్లింగ్: నేడు భజరంగ్ పునియా గెలిస్తే అతని ద్వారా భారత్‌కు మరో కాంస్య పతకం లభిస్తుంది.