ఈసారి బీహార్‌కి బీజేపి ముఖ్యమంత్రి?

బీహార్‌ శాసనసభ ఎన్నికలలో బీజేపి-జేడీయూ (ఎన్డీయే) కూటమి 243 సీట్లలో ఏకంగా 202 సీట్లు గెలుచుకొని సరికొత్త రికార్డ్ సృష్టించింది. వాటిలో బీజేపికి 89, జేడీయూకి 85 సీట్లు వచ్చాయి. ఆ లెక్కన చూసినా జేడీయూ కంటే బీజేపికే ఎక్కువ సీట్లు వచ్చాయి.

నితీష్ కుమార్‌ ఇప్పటికే చాలాసార్లు ముఖ్యమంత్రిగా చేశారు. కనుక సహజంగానే ప్రజలు కూడా మార్పు కోరుకుంటారు. కనుక ఈసారి ముఖ్యమంత్రి పదవి బీజేపి తీసుకోవడం ఖాయమే. ఇందుకు ఆయన కూడా అంగీకరించినట్లు సమాచారం. కానీ అంగీకరించకపోతేనే సమస్య మొదలవుతుంది. 

ఈ ఎన్నికలలో కాంగ్రెస్‌-ఆర్‌జేడీ కూటమికి కేవలం 34 సీట్లు మాత్రమే వచ్చాయి. బీహార్‌తో సహా దేశవ్యాప్తంగా అపలు రాష్ట్రాలలో బీజేపి-ఈసీ కలిసి ఓట్లు చోరీ చేస్తున్నాయని రాహుల్ గాంధీ ముందే ఆరోపించారు. అందువల్లే తాము ఇంత దారుణంగా ఓడిపోయామని చెప్పుకుంటున్నారు. ఆర్‌జేడీకి 25, కాంగ్రెస్‌ పార్టీకి కేవలం 6 సీట్లు మాత్రమే వచ్చాయి. 

తెలంగాణలో ఒక్క హైదరాబాద్‌, పాతబస్తీలో తప్ప మరెక్కడా పోటీ చేయని మజ్లీస్ పార్టీ బీహార్‌ ఎన్నికలలో 5 సీట్లు గెలుచుకోవడం మరో విశేషం. కనుక అక్కడ ఆ పార్టీ మెల్లగా పట్టుసాధిస్తోందని భావించవచ్చు.