ఏపీ సిఎం జగన్‌ నేడు ఢిల్లీకి

ఏపీ సిఎం జగన్‌మోహన్‌రెడ్డి ఈరోజు ఉదయం 10.30 గంటలకు గన్నవరం విమానాశ్రయం నుంచి ఢిల్లీకి బయలుదేరి వెళుతున్నారు. ఈరోజు రాత్రి ఢిల్లీలోనే బస చేసి కేంద్రహోంమంత్రి అమిత్ షా, జలశక్తి మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌, అటవీ పర్యావరణ, సమాచార ప్రసార శాఖమంత్రి ప్రకాశ్‌ జావడేకర్‌, పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌, రైల్వే మంత్రి పియూష్‌ గోయల్‌తో భేటీ అయ్యి రాష్ట్రానికి సంబందించిన పలు అంశాలపై వారితో చర్చించి వినతిపత్రాలు ఇస్తారని సమాచారం. ముఖ్యంగా పోలవరం ప్రాజెక్టుకు నిధుల విడుదల, రాష్ట్రానికి రావలసిన ఇతర నిధుల గురించి మాట్లాడేందుకే ఆయన ఢిల్లీ వెళుతున్నారని సమాచారం. మళ్ళీ శుక్రవారం మధ్యాహ్నం ఢిల్లీ నుంచి అమరావతికి తిరుగు ప్రయాణం అవుతారు.