
ఇంటర్ ద్వితీయ పరీక్షలను రద్దు చేయాలని మంత్రివర్గ సమావేశంలో నిర్ణయమైనట్లు మీడియాలో వస్తున్న వార్తలపై రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్పందిస్తూ, “ఇంటర్ ద్వితీయ పరీక్షల నిర్వహణపై వస్తున్న వార్తలతో విద్యార్ధులలో ఆందోళన చెందుతున్నారు. కనుక ఈ వార్తలపై స్పష్టత ఇచ్చేందుకు మీడియా ముందుకు వచ్చాను.
నిన్న మంత్రివర్గ సమావేశంలో పరీక్షల నిర్వహణ పై చర్చించి, ప్రస్తుత పరిస్థితుల్లో పరీక్షలు నిర్వహించడం మంచిది కాదని ముఖ్యమంత్రి కేసీఆర్ సూచన మేరకు పరీక్షలను రద్దు చేయాలని నిర్ణయించాము. పరీక్ష ఫలితాలకు విధి విధానాల గురించి ఒకటి రెండు రోజుల్లో అధికారులతో సమీక్షా సమావేశం జరిపి నిర్ణయం తీసుకొంటాము,” అని చెప్పారు.