వైఎస్ షర్మిల నేతృత్వంలో తెలంగాణలో ‘వైఎస్సార్ తెలంగాణ పార్టీ’ పేరుతో ఓ కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటుకాబోతోంది. కేంద్ర ఎన్నికల కమీషన్ వద్ద పార్టీ పేరు రిజిస్ట్రేషన్, దానిపై అభ్యంతరాల స్వీకరణ తదితర ప్రక్రియలన్నీ పూర్తయినట్లు ఆ పార్టీ రాష్ట్ర కో-ఆర్డినేటర్ వి.రాజగోపాల్ తెలియజేశారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి రోజున అంటే జూలై 8వ తేదీన పార్టీని ఏర్పాటు చేయబోతున్నామని తెలిపారు. అప్పటికి లాక్డౌన్ ఎత్తివేసి బహిరంగ సభలకు ప్రభుత్వం అనుమతిస్తే వైఎస్ షర్మిల బహిరంగసభ ఏర్పాటు చేసి పార్టీ పేరు, జెండా, అజెండాలను ప్రకటిస్తారు. ఆలోగా పార్టీ సంస్థాగత నిర్మాణం చేసుకొంటామని వి.రాజగోపాల్ తెలియజేశారు.