సంబంధిత వార్తలు
31.jpg)
సిఎం కేసీఆర్ మంగళవారం ప్రగతి భవన్లో మంత్రి వర్గ సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో ప్రధానంగా రాష్ట్రంలో కరోనా తాజా పరిస్థితి, లాక్డౌన్ పొడిగింపు, సడలింపులు, కరోనా మూడవ వేవ్ చేపట్టవలసిన చర్యలు, వైద్య సదుపాయాలు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, రైతుబంధు అమలు, వ్యవసాయ పనులు, సాగునీటి ప్రాజెక్టుల పురోగతి, కల్తీ విత్తనాలను అరికట్టేందుకు తీసుకోవాల్సిన చర్యలు తదితర అంశాలను చర్చించనున్నారు. ఈటల రాజేందర్ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయబోతున్నందున హుజూరాబాద్ ఉపఎన్నికల గురించి మంత్రివర్గ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది.