నేడు స్పీకర్‌కు రాజీనామా పత్రం ఇవ్వనున్న ఈటల

మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ నేడు శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డిని కలిసి తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా పత్రం సమర్పించనున్నారు. ఇందుకోసం ఆయన స్పీకర్ అపాయింట్‌మెంట్ కోరారు. దొరికితే ఈరోజే రాజీనామా పత్రాన్ని సమర్పిస్తారు. నిన్న శామీర్‌పేటలో మీడియా సమావేశం పెట్టి మాట్లాడినప్పుడు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు కానీ బిజెపిలో చేరబోతున్నట్లు ప్రకటించలేదు. స్పీకర్‌కు రాజీనామా పత్రం సమర్పించిన తరువాత బిజెపిలో చేరుతున్నట్లు ప్రకటన చేయవచ్చు. టిఆర్ఎస్‌ కూడా దీనికోసమే ఆతృతగా ఎదురుచూస్తోంది కనుక ఈటల రాజీనామాను వెంటనే ఆమోదించడం ఖాయమే. వచ్చే వారంలో మళ్ళీ ఢిల్లీ వెళ్ళి బిజెపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో బిజెపిలో చేరుతానని చెప్పారు.