ప్రధాని మోడీకి మమతా బెనర్జీ మళ్ళీ మరో షాక్

ఇటీవల యాస్ తుఫాను ప్రభావాన్ని అంచనా వేసేందుకు పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రంలో ఏరియల్ సర్వేకు వచ్చిన ప్రధాని నరేంద్రమోడీ సమీక్షా సమావేశం నిర్వహించగా, దానికి సిఎం మమతా బెనర్జీ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆలాపన్ బందోపాధ్యాయతో సహా ఉన్నతాధికారులు అందరూ డుమ్మా కొట్టారు. అయితే ముఖ్యమంత్రి హోదాలో ఉన్న మమతా బెనర్జీని ఏమీ చేయలేక ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆలాపన్ బందోపాధ్యాయను కేంద్రప్రభుత్వం రీకాల్ చేసింది. కానీ మమతా బెనర్జీ ఆయనను రిలీవ్ చేయబోనని తేల్చి చెప్పి మరో షాక్ ఇచ్చారు. ఆయన ఐఏఎస్ అధికారి కావడంతో కేంద్రప్రభుత్వం ఆయనపై ఏదోవిదంగా చర్యలు చేపట్టే అవకాశం ఉందని గ్రహించిన మమతా బెనర్జీ, ఆయన చేత పదవికి రాజీనామా చేయించి తన ముఖ్య సలహాదారుగా నియమించుకొన్నారు. మమతా బెనర్జీకి షాక్ ఇద్దామని కేంద్రప్రభుత్వం భావిస్తే ఆమె తిరిగి కేంద్రానికి ఈవిదంగా షాక్ ఇచ్చారు. ఆయన స్థానంలో రాష్ట్ర హోం సెక్రటరీగా చేస్తున్న హరికృష్ణ ద్వివేదిని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా మమతా బెనర్జీ నియమించుకొన్నారు