రష్యా నుంచి ప్రత్యేక విమానంలో 27.9 లక్షల స్పుత్నిక్ టీకాలు మంగళవారం తెల్లవారుజామున శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకొన్నాయి. అక్కడ సిద్దంగా ఉంచిన ప్రత్యేక వాహనాలలో వాటిని డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ కు తరలించారు. విదేశాల నుంచి వాక్సిన్లు దిగుమతి చేసుకొనేందుకు కేంద్రరాష్ట్ర ప్రభుత్వాల చేసిన ప్రయత్నాలు ఇప్పటివరకు ఫలించలేదు. కానీ రష్యాతో డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ సంస్థ ఒప్పందం చేసుకొని ఇప్పటివరకు మొత్తం 30 లక్షల వాక్సిన్లను దిగుమతి చేసుకోగలిగింది. మళ్ళీ ఈ నెలాఖరులోగా మరో 50 లక్షల డోసులు పంపిస్తామని రష్యా హామీ ఇచ్చింది. స్పుత్నిక్ వ్యాక్సిన్ల పంపిణీ జూన్ 2వ వారం నుంచి మొదలు పెడతామని ఆ సంస్థ ప్రతినిధులు తెలిపినట్లు సమాచారం.