సంబంధిత వార్తలు

నేటితో ఆంధ్రప్రదేశ్లో కర్ఫ్యూ ముగుస్తున్నందున ఏపీ సిఎం జగన్మోహన్రెడ్డి ఈరోజు తాడేపల్లిలోని తన క్యాంప్ కార్యాలయంలో ప్రభుత్వ ప్రధానకార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్, వివిద శాఖల ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించి రాష్ట్రంలో కరోనా తీవ్రత ఇంకా పూర్తిగా తగ్గనందున కర్ఫ్యూను జూన్ 10వ తేదీ వరకు పొడిగించాలని నిర్ణయించారు. ఎప్పటిలాగే మధ్యాహ్నం 12 నుంచి మర్నాడు ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ అమలులో ఉంటుంది. కర్ఫ్యూ సమయంలో అత్యవసర సేవలకు, వైద్యులు, ఆసుపత్రి సిబ్బంది తదితరులకు మినహాయింపు ఉంటుంది.