
ఆదివారం ప్రగతి భవన్లో జరిగిన మంత్రివర్గ సమావేశంలో రాష్ట్రంలో లాక్డౌన్ పొడిగింపుపై నిర్ణయం తీసుకొంటారని మీడియాలో వస్తున్నన వార్తలపై మజ్లీస్ అధినేత ఎంపీ, అసదుద్దీన్ ఓవైసీ స్పందిస్తూ, లాక్డౌన్ విధించవద్దంటూ నిన్న మధ్యాహ్నం తెలుగులో ట్వీట్ చేశారు.
దానిలో కరోనా కట్టడికి లాక్డౌన్ పరిష్కారం కాదని, లాక్డౌన్ వలన నిరుపేదలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కనుక లాక్డౌన్ పొడిగించవద్దని ట్వీట్ ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. అయితే మంత్రివర్గ సమావేశంలో లాక్డౌన్ మరో పది రోజులు పొడిగించాలని నిర్ణయం తీసుకొన్న సంగతి తెలిసిందే.
సాధారణంగా ఇంగ్లీషులో ట్వీట్ చేసే అసదుద్దీన్ ఓవైసీ నిన్న తెలుగులో ట్వీట్ చేయడం విశేషం. లాక్డౌన్ పొడిగింపు గురించి ఆయన ఏమి ట్వీట్ చేశారో ఆయన మాటల్లోనే...