ఓటుకు నోటు కేసులో రేవంత్‌ రెడ్డికి ఊరట

ఓటుకు నోటు కేసులో రేవంత్‌ రెడ్డికి సుప్రీంకోర్టు ఊరట కల్పిస్తూ ఈ కేసు విచారణ పూర్తయ్యేవరకు సాక్షుల క్రాస్ ఎగ్జామినేషన్ నిలిపివేయాలని తెలంగాణ ఏసీబీ కోర్టును ఆదేశించింది. దీనిపై నాలుగు వారాలలో కౌంటర్ దాఖలు చేయాలని ఏసీబీని ఆదేశించింది.  

ఈ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) గురువారం నాంపల్లి ప్రత్యేక కోర్టులో ఛార్జ్ షీట్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. సుప్రీంకోర్టు ఆదేశాలు ఏసీబీకి మాత్రమే నిర్దేశించినవి కనుక ఈడీ కేసు యధాతధంగా కొనసాగుతుందేమో? ఒకవేళ కొనసాగితే దానిపై కూడా సుప్రీంకోర్టులో పిటిషన్‌ వేస్తే దానికీ బ్రేకులు పడవచ్చు.