ఈ నెల 30న తెలంగాణ మంత్రివర్గ సమావేశం

 ఈ నెల 30న తెలంగాణ రాష్ట్ర మంత్రి వర్గ సమావేశం జరగనుంది. సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరుగబోయే ఈ మంత్రివర్గ సమావేశంలో రాష్ట్రంలో కరోనా పరిస్థితులు, వ్యాక్సినేషన్ పక్రియ, వ్యవసాయం, విత్తనాలు, ఎరువుల లభ్యత, ధాన్యం సేకరణ, కల్తీ విత్తనాల నిరోధం వంటి అంశాలను చర్చించనున్నారు. ఈనెల 30వ తేదీతో రాష్ట్రంలో లాక్ డౌన్ ముగియనుంది కనుక లాక్ డౌన్ పొడిగింపుపై కూడా ఈ సమావేశంలో నిర్ణయం తీసుకొనున్నారు.