సీబీఐ డైరెక్ట‌ర్‌గా సుబోధ్ కుమార్ జైస్వాల్

సెంట్ర‌ల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేష‌న్ (సీబీఐ) డైరెక్ట‌ర్‌గా మహారాష్ట్రకు చెందిన ఐపీఎస్ అధికారి సుబోధ్ కుమార్ జైస్వాల్‌  బుదవారం బాధ్యతలు స్వీకరించారు. 1985 ఐపీఎస్ బ్యాచ్ మహారాష్ట్ర క్యాడర్‌కు చెందిన సుబోధ్ రెండేళ్ళపాటు ఈ పదవిలో  కొనసాగుతారు. ఈ పదవి చెప్పట్టేముందు ఆయన సీఐఎస్ఎఫ్‌ డైరెక్టర్ జనరల్‌గా చేశారు. అంతకు మునుపు అంటే 2018-2019లో జైస్వాల్ ముంబై పోలీస్ కమీషనర్‌గా పనిచేశారు. అంతకు ముందు మహారాష్ట్ర యాంటీ టెర్రరిజం స్క్వాడ్‌లోనూ, ఇంటలిజన్స్ బ్యూరో (ఐబీ), రీసర్చ్ అనాలసిస్ వింగ్ (రా)లోపని చేసి అపార అనుభవం, మంచి సమర్ధుడైన అధికారిగా పేరు ప్రతిష్టలుకూడా సంపాదించారు    

బహుశః అందుకే ప్రధాని నరేంద్రమోడీ అధ్యక్షతన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్వీ రమణ, ప్రతిపక్ష నేత అధిర్ రంజన్‌లతో కూడిన కమిటీ సుబోధ్ కుమార్ జైస్వాల్‌ను డైరెక్టరుగా ఎంపిక చేసిందని భావించవచ్చు.