.jpg)
నేటి నుంచి విధులు బహిష్కరించి సమ్మె చేస్తున్న జూనియర్ డాక్టర్లను మంత్రి కేటీఆర్ సున్నితంగా హెచ్చరించారు. ఈ కరోనా సమయంలో సమ్మె చేసి ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలనుకోవడం సరికాదు. వారి సమస్యలను ప్రభుత్వం పరిశీలిస్తోంది. కనుక తక్షణం సమ్మె విరమించాలని వారికి విజ్ఞప్తి చేస్తున్నాను లేకుంటే చట్ట ప్రకారం చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది,” అని సున్నితంగా హెచ్చరించారు.
అయితే తమ సమస్యలు, డిమాండ్ల గురించి ప్రభుత్వం దృష్టికి ఎన్నిసార్లు తీసుకువెళ్ళినా పట్టించుకోనందునే సమ్మె చేయవలసి వస్తోందని జూనియర్ డాక్టర్ల అసోసియేషన్ ప్రతినిధులు చెపుతున్నారు. తమ సమస్యలను పరిష్కారించేందుకు ప్రభుత్వం నిర్ధిష్టమైన హామీ ఇస్తేనే సమ్మె విరమిస్తామని చెపుతున్నారు. వారికీ, ప్రభుత్వానికి మద్య ఏర్పడిన ఈ ప్రతిష్టంభన ఎంతకాలం కొనసాగుతుందో తెలీదు కనుక అప్పటివరకూ రోగులు తీవ్ర ఇబ్బందులు పడక తప్పకపోవచ్చు.