సంబంధిత వార్తలు

తెలంగాణ శాసన మండలిలో పట్టభద్రుల నియోజకవర్గాల నుంచి కొత్తగా ఎన్నికైన ఇద్దరు ఎమ్మెల్సీలు సురభి వాణిదేవి, పల్లా రాజేశ్వర్ రెడ్డిల చేత శాసనమండలి చైర్మన్ ఈనెల 26న ప్రమాణం చేయించనున్నారు. కరోనా నేపధ్యంలో అతి కొద్దిమంది సమక్షంలో ఈ కార్యక్రమం జరగనుంది.
సురభి వాణి దేవి తెరాస అభ్యర్థిగా మహబూబ్ నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ పట్టభద్రుల స్థానం నుంచి పోటీ చేసి బిజెపి అభ్యర్థి ఎన్. రామచంద్రరావుపై గెలుపొంది మొదటిసారిగా శాసనమండలిలో అడుగుపెట్టనున్నారు.
పల్లా రాజేశ్వర్ రెడ్డి తెరాస అభ్యర్థిగా నల్లగొండ-వరంగల్-ఖమ్మం పట్టభద్రుల స్థానం నుంచి పోటీ చేసి గెలుపొంది శాసనమండలిలో రెండోసారి అడుగుపెట్టనున్నారు.