
తెలంగాణ రాష్ట్రంలో నిన్నటి నుంచి పోలీసులు లాక్‌డౌన్ ఆంక్షలు చాలా కటినంగా అమలుచేస్తున్నారు. ఈ-పాసులు ఉన్నవారిని మాత్రమే అనుమతిస్తున్నారు. నిన్న స్వీగ్గీ, జోమోటో తదితర ఫుడ్ డెలివరీ, ఈ-కామర్స్ సంస్థల డెలివరీ బాయ్స్ ని కూడా అనుమతించలేదు. కానీ తరువాత వారిని వదిలేశారు. నేటి నుంచి లాక్‌డౌన్ సమయంలో అత్యవసర సర్వీసులు అందజేసేవారికి మినహాయింపు ఇస్తూ డిజిపి మహేందర్ రెడ్డి మళ్ళీ కొత్తగా ఆదేశాలు జారీ చేశారు.
• ప్రభుత్వ, ప్రైవేట్ వైద్యులు, నర్సులు, వైద్య సిబ్బంది, ల్యాబ్ టెక్నీషియన్స్, ఆసుపత్రి సిబ్బంది, ఆక్సిజన్ టెక్నీషియన్స్, మందుల దుకాణాలవారికి.
• ప్రభుత్వోద్యోగులు, ఎయిర్ పోర్ట్ ఉద్యోగులు, పైలట్లు.
• నిర్మాణపనులు చేసుకొని ఇళ్లకు తిరిగివెళ్ళే పనివారికి.