18.jpg)
తెలంగాణ రాష్ట్రంలో కరోనా కట్టడికి లాక్‌డౌన్ మరింత కటినంగా అమలుచేయాలని సిఎం కేసీఆర్ పోలీస్ అధికారులను ఆదేశించారు. నిన్న వరంగల్ కలెక్టర్ కార్యాలయం నుంచి డిజిపి మహేందర్ రెడ్డి, పోలీస్ కమీషనర్లు, ఎస్పీలు, జిల్లా కలెక్టర్లతో సిఎం కేసీఆర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా వారిని ఉద్దేశ్యించి మాట్లాడుతూ, “లాక్‌డౌన్ వలన ఆర్ధికంగా నష్టపోతున్నప్పటికీ ప్రజల ప్రాణాలే ముఖ్యమని భావించి లాక్‌డౌన్ విధించాముగ్రామస్థాయిలో ప్రజలు లాక్‌డౌన్ బాగానే అమలుచేస్తున్నారు కానీ పట్టణాలు, నగరాలలో లాక్‌డౌన్ ఖచ్చితంగా అమలుకావడం లేదు. కనుక నేటి నుంచి లాక్‌డౌన్ మరింత కటినంగా అమలుచేయాలని కోరుతున్నాను. పాసులు కలిగి అత్యవసర పనులపై బయటకు వచ్చినవారిని తప్ప ఎవరినీ ఉపేక్షించవద్దు. నూటికి నూరుశాతం లాక్‌డౌన్ అమలైతేనే దాని ప్రయోజనం ఉంటుంది,” అని అన్నారు.
తెలంగాణలో లాక్‌డౌన్ ఈనెల 30వరకు ఉదయం 10 నుంచి మర్నాడు ఉదయం 6 గంటల వరకు అమలులో ఉంటుంది.