
సిఎం కేసీఆర్ ఈరోజు మధ్యాహ్నం గాంధీ ఆసుపత్రిలో పర్యటించారు. సిఎం కేసీఆర్‌తో పాటు మంత్రి హరీష్‌రావు, ప్రభుత్వ ప్రధానకార్యదర్శి సోమేష్ కుమార్ తదితరులు కూడా వెళ్ళారు. సిఎం కేసీఆర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కరోనా రోగుల వద్దకు వెళ్ళి పలకరించి వారికి ధైర్యం చెప్పారు. సౌకర్యాలు, మందులు, చికిత్స, వారి ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకొన్నారు. అంతకు ముందు ఆసుపత్రిలో వైద్యులు, నర్సులు, సిబ్బందితో మాట్లాడి వారి సేవలను ప్రశంశించారు. ఆ తరువాత ఆసుపత్రిలో ఆక్సిజన్ ప్లాంట్, మెడికల్ కాలేజీ, మరో 300 బెడ్లు ఏర్పాటు చేయబోతున్న లైబ్రెరీ హాల్ తదితర ప్రాంతాలలో తిరిగి అధికారులకు పలు సూచనలు చేశారు. ఆసుపత్రి సిబ్బందితో కూడా మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకొన్నారు.
రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖను ఇప్పుడు సిఎం కేసీఆర్ స్వయంగా చూసుకొంటున్నారు కనుక తొలిసారిగా గాంధీ ఆసుపత్రిలో పర్యటించి పరిస్థితిని స్వయంగా సమీక్షించినట్లు భావించవచ్చు.