
తెలంగాణ రాష్ట్రంలో ఈనెల 21తో లాక్డౌన్ ముగియనుండగా దానిని ఈనెల 30 వరకు పొడిగించాలని సిఎం కేసీఆర్ నిర్ణయించారు. ప్రతీరోజూ ఉదయం 10 గంటల నుండి మర్నాడు ఉదయం 6 గంటల వరకు లాక్డౌన్ అమలులో ఉంటుంది. నిన్న మంత్రివర్గ సమావేశం నిర్వహించి రాష్ట్రంలో కరోనా పరిస్థితిని సమీక్షించిన తరువాత లాక్డౌన్ పొడిగింపుపై నిర్ణయం తీసుకోవాలని భావించినప్పటికీ, కరోనా కారణంగా మంత్రివర్గ సమావేశం రద్దు చేసి సిఎం కేసీఆర్ మంత్రులు, ఉన్నతాధికారులతో ఫోన్లో మాట్లాడి వారి అభిప్రాయాలూ తెలుసుకొన్నారు. కరోనా కట్టడికి లాక్డౌన్ పొడిగింపు అనివార్యమని అందరూ అభిప్రాయం వ్యక్తం చేయడంతో లాక్డౌన్ పొడిగించాలని సిఎం కేసీఆర్ నిర్ణయించారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధానకార్యదర్శి సోమేష్ కుమార్ నేడు ఉత్తర్వులు జారీ చేయనున్నారు.