
వైఎస్ షర్మిల ఏ ముహూర్తాన్న తెలంగాణ రాజకీయాలలో అడుగుపెట్టారో కానీ కరోనా భయంతో ఆమె ఇంట్లో నుండి అడుగు బయటకు పెట్టలేని పరిస్థితి ఏర్పడింది. కనుక ఆమె కూడా ట్విట్టర్ ద్వారా సిఎం కేసీఆర్, టిఆర్ఎస్ ప్రభుత్వంపై బాణాలు సందిస్తూ కాలక్షేపం చేయక తప్పడం లేదు. తాజాగా ఆమె సిఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌పై విమర్శలు గుప్పించారు. పిల్లి కళ్ళు మూసుకొని పాలు త్రాగుతూ తనను ఎవరూ చూడలేదనుకొన్నట్లు, సిఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ వ్యవహరిస్తున్నారంటూ విమర్శించారు. తండ్రీకోడుకులు గారడీ మాటలు కత్తి పెట్టి రాష్ట్ర ప్రజలకు మందులు, వాక్సిన్లు, ఆక్సిజన్ అందించడానికి ప్రయత్నించాలని హితవు పలికారు. ఆమె ట్వీట్ ఆమె మాటల్లోనే....