నేడు మంత్రివర్గ సమావేశం... లాక్‌డౌన్‌పై చర్చ?

రాష్ట్రంలో కరోనా పరిస్థితులు, కరోనా కట్టడికి తీసుకొంటున్న, ఇంకా తీసుకోవలసిన చర్యలు, ఆక్సిజన్‌, మందులు, వాక్సిన్లు వగైరా సరఫరా తదితర అంశాలపై చర్చించేందుకు సిఎం కేసీఆర్‌ ఈరోజు ప్రగతి భవన్‌లో మంత్రివర్గ సమావేశం నిర్వహించనున్నారు. రాష్ట్రంలో లాక్‌డౌన్‌ విధింపుపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించనున్నట్లు సమాచారం. కానీ లాక్‌డౌన్‌ విధించే ఉద్దేశ్యం లేదని సిఎం కేసీఆర్‌ ఇదివరకే స్పష్టం చేసినందున, హైకోర్టు సూచన మేరకు వారాంతపు లాక్‌డౌన్‌ విధించే అవకాశం ఉంది. 

ఇవి కాక ఈటల రాజేందర్‌పై తీసుకొన్న చర్యలు, తదనంతర పరిణామాలపై సిఎం కేసీఆర్‌ మంత్రులకు వివరించి దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది.