సంబంధిత వార్తలు

తెలంగాణ రాష్ట్ర సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌కు కరోనా వైరస్ సోకింది. తనకు కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయిందని ఆయనే స్వయంగా తెలిపారు. కరోనా స్వల్ప లక్షణాలు కనబడగానే పరీక్ష చేయించుకోగా పాజిటివ్ అని తేలిందని తెలిపారు. ప్రస్తుతం హోమ్ ఐసోలేషన్‌లో ఉండి చికిత్స తీసుకొంటున్నట్లు తెలిపారు. ఇటీవల తనను కలిసిన వారందరూ కూడా కరోనా టెస్టులు చేయించుకోవాలని మంత్రి కొప్పుల విజ్ఞప్తి చేశారు.