తెలంగాణలో రాత్రి కర్ఫ్యూ పొడిగింపు

తెలంగాణ రాష్ట్రంలో కరోనా కట్టడి కోసం విధించిన రాత్రి కర్ఫ్యూను ఈనెల 15వ తేదీ ఉదయం 5 గంటల వరకు పొదిగిస్తూ తెలంగాణ ప్రభుత్వ ప్రధానకార్యదర్శి సోమేష్ కుమార్‌ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్రంలో ఏప్రిల్ 20వ తేదీ రాత్రి నుంచి నైట్ కర్ఫ్యూ అమలుచేస్తున్నారు. మందుల దుకాణాలు, అంబులెన్స్ వంటి అత్యవసర సేవలకు  కర్ఫ్యూ నుంచి మినహాయింపునిచ్చారు. ఇప్పటికే హైదరాబాద్‌ నగరంలో కరోనా కారణంగా అనేక మార్కెట్లు సాయంత్రం 5-6 గంటలకే మూసివేస్తున్నారు. కనుక సామాన్య ప్రజలతో సహా ఎవరికీ రాత్రిపూట కర్ఫ్యూ వలన పెద్దగా ఇబ్బంది లేదనే భావించవచ్చు. కానీ పగలంతా విచ్చలవిడిగా ప్రజలు రోడ్లపై తిరుగుతున్నప్పుడు పట్టించుకోకుండా రోడ్లపై ఎవరూ ఉందని రాత్రి పూట కర్ఫ్యూ విధించడం వలన కరోనా కట్టడి ఏవిదంగా సాధ్యం? అని కాంగ్రెస్‌ నేతలు ప్రశ్నిస్తున్నారు.