సంబంధిత వార్తలు
21.jpg)
ఇటీవల కరోనా బారిన పడిన తెలంగాణ సిఎం కేసీఆర్‌కు మంగళవారం ర్యాపిడ్ యాంటిజెన్, ఆర్టీపీసీఆర్ టెస్టులు చేయగా నెగెటివ్ అని తేలింది. ఆయన రక్త పరీక్షలలో కూడా అన్నీ నార్మల్‌గా ఉన్నట్లు తేలింది. ఇంతకు ముందు సిటీ స్కానింగ్‌లో కూడా ఆయన ఊపిరితిత్తులు బాగానే ఉన్నట్లు తేలింది. దీంతో ఆయన కరోనా నుంచి పూర్తిగా విముక్తి పొందినట్లయింది. ఆయనకు కరోనా సోకినప్పటి నుంచి డాక్టర్ ఎంవీ రావు నేతృత్వంలో వైద్య బృందం ఆయనకు చికిత్స చేసింది. కరోనా నుంచి విముక్తి పొందడంతో సిఎం కేసీఆర్ మళ్ళీ రోజువారీ కార్యక్రమాలలో పాల్గొంటున్నారు.