ఈటలకు భద్రత కుదింపు

ఈటల రాజేందర్‌ను మంత్రివర్గంలో నుంచి తొలగించడంతో ప్రభుత్వం ఆయన భద్రతను కుదించింది. మంత్రులకు ఉండే ప్రత్యేక భద్రతను తొలగించి ఎమ్మెల్యేలకు ఇచ్చే ఇద్దరు గన్‌మెన్‌లను మాత్రం ఉంచింది. ఆయనకు ఇచ్చిన వాహనాలను, వాటి డ్రైవర్లను కూడా ప్రభుత్వం వాపసు తీసుకొంది. కనుక ఇకపై ఆయన సొంత వాహనంలోనే ప్రయాణించవలసి ఉంటుంది. 

మంత్రులందరికీ బుల్లెట్ ప్రూఫ్ వాహనాలను, డ్రైవర్లను ప్రభుత్వమే ఏర్పాటు చేస్తుంది. జిల్లా లేదా హైదరాబాద్‌ పర్యటనకు బయలుదేరినప్పుడు ఎస్కార్ట్ వాహనాలు ఉంటాయి.  మంత్రుల భద్రత కోసం 24 గంటలు పనిచేసే 2+2 గన్‌మెన్‌లు, వారి ఇళ్ళలో భద్రత కోసం ఒక మహిళా భద్రతా సిబ్బందితో సహా నలుగురిని ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. ప్రవేశద్వారం వద్ద మెటల్ డిక్టేటర్‌ను కూడా ఏర్పాటు చేస్తుంది. వీటన్నిటినీ ఈటల రాజేందర్‌కు తొలగించింది.