సంబంధిత వార్తలు

తెలంగాణలో కరోనా కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం ఏప్రిల్ 20 నుంచి మే 1 వరకు రాత్రిపూట కర్ఫ్యూ విధించిన సంగతి తెలిసిందే. అయినప్పటికీ కరోనా కేసులు తగ్గకపోగా ఇంకా పెరుగుతుండటంతో కర్ఫ్యూ ముగియగానే లాక్‌డౌన్ విధించవచ్చని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే లాక్‌డౌన్ విధించే ఉద్దేశ్యం లేదని రాత్రిపూట కర్ఫ్యూను మాత్రం మే 8వరకు పొడిగిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈమేరకు తెలంగాణ ప్రభుత్వ ప్రధానకార్యదర్శి సోమేష్ కుమార్ కొద్దిసేపటి క్రితం ఉత్తర్వులు జారీ చేశారు. మే 8వ తేదీ తెల్లవారుజాము 5 గంటల వరకు రాత్రిపూట కర్ఫ్యూ కొనసాగుతుందని తెలియజేశారు.