ఉత్తమ్‌కుమార్ రెడ్డికి కరోనా

తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి కరోనా బారిన పడ్డారు. ఈ విషయం ఆయనే స్వయంగా తెలిపారు. ఆర్‌టిపిసిఆర్ టెస్టుల్లో నెగటివ్ వచ్చిందని, సిటీ స్కాన్  చేయించుకుంటే పాజిటివ్ అని వచ్చిందని తెలిపారు. హైదరాబాద్‌, గచ్చిబౌలిలో ఉన్న ఏఐజి ఆసుపత్రిలో చేరి ఉత్తమ్‌కుమార్ రెడ్డి చికిత్స తీసుకుంటున్నారు. తనను కలిసిన వారందరూ కూడా కరోనా టెస్టులు చేయించుకోవాలని ఉత్తమ్‌కుమార్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.