
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా తీవ్రత నానాటికీ పెరిగిపోతుండటంతో ప్రభుత్వం కొన్ని కీలక నిర్ణయాలు తీసుకొంది. ఆ వివరాలు క్లుప్తంగా...
1. రాత్రి 10 నుంచి తెల్లవారుజామున 5 గంటల వరకు రాష్ట్రవ్యాప్తంగా కర్ఫ్యూ అమలు.
2. 18-45 ఏళ్ళలోపున్న అందరికీ ఉచితంగా కరోనా టీకాలు. దీని కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.1,600 కోట్లు ఖర్చు చేయనుంది.
3. పదో తరగతి, ఇంటర్, డిగ్రీ పరీక్షలు యధాతధంగా నిర్వహించబడతాయి. విద్యార్దుల భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకొన్నట్లు ప్రభుత్వం తెలిపింది.
4. రైతుబజార్లలో జనసమూహాలను నివారించేందుకు ప్రతీ కొన్ని వార్డులకు ఓ మొబైల్ రైతు బజార్లు ఏర్పాటు.
5. ఆక్సిజన్ రవాణాకు మరో 100-120 వాహనాలు ఏర్పాటు.
6. కరోనా చికిత్స పేరుతో రోగులను దోచుకొంటున్న ప్రైవేట్ ఆసుపత్రులపై కటిన చర్యలు.
7. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కళ్యాణమండపాలను కోవిడ్ కేర్ సెంటర్లుగా వినియోగించుకోవాలి.