సిఎం కేసీఆర్‌ హెల్త్ రిపోర్ట్

తెలంగాణ సిఎం కేసీఆర్‌కు ఇటీవల కరోనా సోకడంతో తన ఫామ్‌హౌస్‌లో ఉంటూ వైద్య చికిత్స తీసుకొంటున్న సంగతి తెలిసిందే. సిఎం కేసీఆర్‌ ఆరోగ్యం పూర్తిగా మెరుగుపడిందని ఆయనకు చికిత్స చేస్తున్న డాక్టర్ ఎంవీ రావు తెలిపారు. సిటి స్కాన్, రక్త పరీక్షల నివేదికలలో ఎటువంటి ఇన్ఫెక్షన్లు లేవని తేలిందని చెప్పారు. రిపోర్టులన్నీ బాగున్నాయని కనుక ఒకటి రెండు రోజులు విశ్రాంతి తీసుకొని సిఎం కేసీఆర్‌ మళ్ళీ ప్రగతి భవన్‌ చేరుకొని రోజువారీ కార్యక్రమాలలో పాల్గొంటారని చెప్పారు.