కేంద్రానికి కేటీఆర్‌ సూటి ప్రశ్న

సీరం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్ ఇండియా నిన్న కోవీషీల్డ్ వాక్సిన్‌ల ధరలను ప్రకటించిన సంగతి తెలిసిందే. రాష్ట్ర ప్రభుత్వాలకు ఒక్కో డోస్ రూ.400, ప్రైవేట్ ఆసుపత్రులకు ఒక్కో డోస్ రూ.600 చొప్పున సరఫరా చేస్తామని ప్రకటించింది. దీనిపై తెలంగాణ మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్‌ ఘాటుగా స్పందించారు. 

“ఒక దేశం...ఒకే పన్ను విదానం కొరకు జీఎస్టీని అంగీకరించాం. కానీ ఇప్పుడు ఒక దేశం... వాక్సిన్లకు రెండు వేర్వేరు ధరలను చూస్తున్నాము. కేంద్రప్రభుత్వానికి రూ.150, రాష్ట్ర ప్రభుత్వాలకు రూ.400! దేశవ్యాప్తంగా కరోనా వాక్సినేషన్ వేగంగా జరిగేందుకు కేంద్రప్రభుత్వం పీఎం కేర్ ఫండ్స్ నుంచి ఈ అదనపు భారాన్ని భరించలేదా?” అని మంత్రి కేటీఆర్‌ ట్వీట్ చేశారు.