జనం తిరగనప్పుడు కర్ఫ్యూ ఎందుకు? భట్టి ప్రశ్న

తెలంగాణలో నిన్నటి నుంచి రాత్రి పూట కర్ఫ్యూ విధించడంపై సీఎల్పీ నేత భట్టి విక్రమార్క స్పందిస్తూ, “కరోనా కట్టడి చేయాలంటే రోడ్లపై జనం తిరగకుండా పగలు కర్ఫ్యూ విధించాలి కానీ అందరూ ఇళ్ళలో నిద్రపోయే రాత్రిపూట కర్ఫ్యూ విధించి ఏం ప్రయోజనం? రెండో దశ కరోనా మొదలవక మునుపే గట్టి చర్యలు తీసుకోవాలని మేము శాసనసభ సమావేశాలలోనే గట్టిగా చెప్పాము. కానీ జనసమర్ధం ఎక్కువగా ఉండే మద్యం దుకాణాలు, పబ్బులు, సినిమా హాల్స్, షాపింగ్ మాల్స్ మూసివేయడానికి సిఎం కేసీఆర్‌ వెనకాడారు. ఇప్పుడు పరిస్థితులు చెయ్యి దాటిపోయిన తరువాతైనా సరైన చర్యలు చేపట్టకుండా నైట్ కర్ఫ్యూ విధించి సరిపెట్టారు. కరోనాను కట్టడి చేయాలనుకొంటే పగటిపూట కర్ఫ్యూ విధించాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం తీరు చూస్తే చేతులు కాలాక ఆకులు పట్టుకొన్నట్లుంది. సిఎం కేసీఆర్‌ త్వరగా కోలుకోవాలని భగవంతుడిని ప్రార్ధిస్తున్నాను,” అని అన్నారు.