సిఎం కేసీఆర్‌కు కరోనా!

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ కరోనా బారినపడ్డారు. ఈవిషయం ప్రభుత్వ ప్రధానకార్యదర్శి సోమేష్ కుమార్‌ ఓ ప్రకటన ద్వారా తెలియజేశారు. ఆయనకు కొద్దిగా కరోనా లక్షణాలు కనబడటంతో వైద్యుల సూచన మేరకు ఎర్రవెల్లిలోని తన ఫాంహౌసులో హోం ఐసోలేషన్‌లో ఉన్నారు. స్వల్ప లక్షణాలు తప్ప ఆయన ఆరోగ్యం బాగానే ఉందని ప్రకటనలో తెలియజేశారు. 

సిఎం కేసీఆర్‌కు కరోనా సోకినట్లు తెలియగానే అధికార టిఆర్ఎస్‌తో సహా వివిదపార్టీలు, వివిద రంగాలకు చెందిన ప్రముఖులు ఆయన త్వరగా కోలుకోవాలని ఆ దేవుడిని ప్రార్ధిస్తున్నామంటూ ట్వీట్స్ చేస్తున్నారు.