సాగర్‌లో టిఆర్ఎస్‌కు మద్దతు ప్రకటించిన సిపిఎం

నాగార్జునసాగర్ ఉపఎన్నిక పర్వంలో సోమవారం ఆసక్తికర పరిణామం జరిగింది. నిత్యం ప్రభుత్వ విధానాలను విమర్శిస్తుండే సిపిఐ(ఎం) టిఆర్ఎస్‌ అభ్యర్ధి నోముల భగత్ కుమార్‌కు మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించింది. సాగర్ నియోజకవర్గంలో ఏర్పడిన ప్రత్యేక రాజకీయ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకొన్నట్లు తెలిపింది. ఇప్పటికే ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్న టిఆర్ఎస్‌కు సిపిఐ(ఎం) నిర్ణయం మరింత ఉత్సాహాన్ని కలిగిస్తుంది.