
తెలంగాణలో గుర్తింపు పొందిన ప్రైవేట్ విద్యాసంస్థలు మళ్ళీ మూతపడటంతో వాటిలో పనిచేస్తున్న లక్షలాదిమంది ఉపాధ్యాయులు, సిబ్బంది మళ్ళీ రోడ్డున పడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం వారిని ఆదుకొనేందుకు నెలకు రూ.2,000 ఆర్ధిక సాయం, 25 కేజీలు బియ్యం అందించాలని నిర్ణయించింది. ప్రాధమిక అంచనా ప్రకారం రాష్ట్రంలో సుమారు 1.45 లక్షల మంది ప్రైవేట్ విద్యాసంస్థలు పనిచేస్తున్నట్లు గురించారు. వారందరికీ సాయం అందించేందుకు నెలకు రూ.42 కోట్లు ఖర్చవుతుందని అధికారులు అంచనా వేశారు.
మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, గంగుల కమలాకర్ నేడు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్లతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ నెల నుంచి ఈ సాయం అందించాలని సిఎం కేసీఆర్ ఆదేశించడంతో రేషన్ దుకాణాల వారీగా వీలైనంత త్వరగా లబ్దిదారులను గుర్తించి వారికి సాయం అందజేయాలని మంత్రులు జిల్లా కలెక్టర్లను ఆదేశించారు.