తెలంగాణలో మరో రెండు కొత్త పధకాలు

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం త్వరలో మరో కొత్త పథకాన్ని ప్రారంభించనున్నట్లు బీసీ సంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్ తెలియజేశారు. ఈ ఆర్థిక సంవత్సరంలో చేపట్టబోయే కార్యక్రమాలపై ఆయాశాఖల ఉన్నతాధికారులతో ఆయన శుక్రవారం టెలికాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి గంగుల మాట్లాడుతూ తెరాస ఆవిర్భావ దినోత్సవ ఏప్రిల్ 27న  “కెసిఆర్ ఆపద్బంధు పథకం”, బీసీ మహిళల స్వాలంబన కోసం మరో కొత్త పథకం కూడా ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఈ పధకం అమలుకు ముందు బీసీ సంఘాలతో ప్రత్యేకంగా సమావేశమై వారి సలహాలు, సూచనలను పరిగణలోకి తీసుకుంటామని గంగుల తెలిపారు.