మరో హామీ నెరవేర్చిన టిఆర్ఎస్‌ ప్రభుత్వం

టిఆర్ఎస్‌ మళ్ళీ అధికారంలోకి రాగానే రాష్ట్రంలో దోభీఘాట్లు, లాండ్రీలు, సెలూన్లకు ఉచితంగా విద్యుత్ అందిస్తామన్న టిఆర్ఎస్‌ ఎన్నికల వాగ్ధానాన్ని అమలుచేయాలని సిఎం కేసీఆర్ నిర్ణయించారు. ఇక నుంచి వారికి నెలకు 250 యూనిట్ల వరకు ఉచితం విద్యుత్ సరఫరా చేయాలని, ఇందుకోసం ఉత్తర్వులను జారీ చేయాలని సీఎంఓ కార్యదర్శి భూపాల్ రెడ్డిని సిఎం కేసీఆర్‌ ఆదేశించారు. ఈ మేరకు నిన్న ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉచిత విద్యుత్ పధకం ఏప్రిల్ 1వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా అమలులోకి వస్తుందని ఉత్తర్వులలో పేర్కొన్నారు. రాష్ట్రంలో కులవృత్తులను ప్రోత్సహించి జీవనోపాధిని పెంచాలనే ఉద్దేశ్యంతో సిఎం కేసీఆర్‌ ఈ నిర్ణయం తీసుకొన్నట్లు భూపాల్ రెడ్డి తెలిపారు. దీని వలన రాష్ట్రంలో ఆ వృత్తులపై ఆధారపడి జీవిస్తున్న లక్షల మందికి లబ్ది కలుగుతుందని అన్నారు.