తెలంగాణ ఉద్యోగులను రిలీవ్ చేసిన ఏపీ సర్కార్

రాష్ట్ర విభజన సందర్భంగా ఉద్యోగుల విభజనలో భాగంగా తెలంగాణకు చెందిన ఉద్యోగులు ఏపీకి, ఏపీకి చెందిన ఉద్యోగులు తెలంగాణకు కేటాయించబడటంతో అప్పటి నుంచి వారు తమ స్వంత రాష్ట్రాలకు తిరిగి వెళ్ళేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. ఏపీ ప్రభుత్వంలో పనిచేస్తున్న 711 మంది క్లాస్-3, క్లాస్-4 తెలంగాణ ఉద్యోగులను వారి అభ్యర్ధన మేరకు రిలీవ్ చేస్తూ ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాధ్ దాస్‌ బుదవారం ఉత్తర్వులు జారీచేశారు. వారందరూ ఏపీ సిఎం జగన్‌మోహన్‌రెడ్డిని కలిసి కృతజ్ఞతలు తెలుపుకున్నారు. వారికి ఆయన శుభాకాంక్షలు తెలియజేశారు. తెలంగాణ ప్రభుత్వం వారందరినీ వారు పనిచేస్తున్న శాఖలలోకి తీసుకోనుంది.