ఎవర్ గ్రీన్‌ కదిలింది...చంద్రుడి దయతో!

అవును! గత వారం రోజులుగా సూయజ్ కాలువలో అడ్డంగా ఇరుక్కుపోయిన 1,300 అడుగుల పొడవైన ఎవర్ గ్రీన్‌ నౌక కదిల్చేందుకు కష్టపడుతున్న నిపుణులకు నింగిలోని చంద్రుడు కూడా తోడ్పడ్డాడు. ఏవిదంగా అంటే, అమావాస్య, పౌర్ణమి సందర్భంగా సముద్రంలో ఆటుపోట్లు ఎక్కువగా ఉంటాయనే సంగతి తెలిసిందే. సూయజ్ కాలువలో ఓ వైపు ఇసుకలో కూరుకుపోయిన ఎవర్ గ్రీన్‌ నౌకను 10 టగ్ బోట్లతో బయటకులాగేందుకు నిపుణుల బృందాలు ఆదివారం ప్రయత్నిస్తుండగా, ఆరోజు పౌర్ణమి కావడంతో సముద్రంలో పోటు పెరిగి భారీగా అలలుఏర్పడ్డాయి. వాటి ధాటికి ఎవర్ గ్రీన్‌ నౌకను కదిలించడం సులువైంది. అలల తీవ్రత ఎక్కువగా ఉండగానే 10 టగ్ బోట్లు ఎవర్ గ్రీన్‌ నౌకను మెల్లిగా...చాలా ఒడుపుగా సూయజ్ కాలువలో ముందుకు సాగేవిదంగా తిప్పి నిలబెట్టాయి. దాంతో ఎవర్ గ్రీన్‌ నౌకను మెల్లగా ముందుకుసాగి కొంతదూరం వెళ్ళి నలబడటంతో సూయజ్ కాలువలో మళ్ళీ వాణిజ్య నౌకలు ప్రయాణించడం మొదలుపెట్టాయి. ఎవర్ గ్రీన్‌ నౌక ఇరుక్కుపోవడంతో సుమారు 400 వాణిజ్య నౌకలు నిలిచిపోయాయి. వారం రోజులుగా వాణిజ్య నౌకల రాకపోకలు నిలిపోవడంతో లక్షల కోట్లు నష్టం వాటిల్లింది. ఇప్పుడు సూయజ్ కాలువ క్లియర్ అయ్యింది కనుక రెండు మూడు రోజులలో అక్కడ నిలిచిపోయిన నౌకలన్నీ మళ్ళీ వాటి గమ్యస్థానాలకు ప్రయాణమవుతాయి.