సాగర్ ఎన్నికలకు ముందు బిజెపికి షాక్

నాగార్జునసాగర్ ఉపఎన్నికలకు నేడు బిజెపి అభ్యర్ధిగా ఎంపికైన డాక్టర్ రవికుమార్ నాయక్ నామినేషన్ వేస్తుండగా, టికెట్ ఆశించి భంగపడిన కడారి అంజయ్య పార్టీకి గుడ్ బై చెప్పేసి టిఆర్ఎస్‌లో చేరిపోతున్నారు. ఈరోజు మధ్యాహ్నం టిఆర్ఎస్‌ ఎమ్మెల్యేలు రవీంద్రకుమార్, సైదిరెడ్డిలతో కలిసి సిఎం కేసీఆర్‌ను కలిసేందుకు ఫామ్‌హౌసుకు బయలుదేరారు. సిఎం కేసీఆర్‌ సమక్షంలో కడారి అంజయ్య టిఆర్ఎస్‌లో చేరనున్నారు. ఈ ఉపఎన్నికలు బిజెపికి చాలా ప్రతిష్టాత్మకమైనవి. ఇటువంటి కీలకసమయంలో సాగర్‌లో కీలకనేత ప్రత్యర్ధి పార్టీలో చేరిపోవడం బిజెపికి పెద్ద ఎదురుదెబ్బే అని చెప్పవచ్చు. అయితే బిజెపిపై అలిగి టిఆర్ఎస్‌లో చేరుతున్న కడారి అంజయ్యకు సిఎం కేసీఆర్‌ ఏమి హామీ ఇస్తారో చూడాలి. నాగార్జునసాగర్ బిజెపి ఇన్‌-ఛార్జ్ కంకణాల నివేదిత రెడ్డి ఇప్పటికే నామినేషన్ వేశారు. ఆమె నామినేషన్ ఉపసంహరించుకోకపోతే బిజెపికి పార్టీలో వ్యక్తులతోనే పోటీ ఎదుర్కోవలసివస్తుంది.