టిఆర్ఎస్‌ ఎమ్మెల్సీ సురభి వాణీదేవికి కరోనా

హైదరాబాద్‌-రంగారెడ్డి-మహబూబ్‌నగర్‌ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి టిఆర్ఎస్‌ అభ్యర్ధిగా పోటీ చేసి ఎమ్మెల్సీగా ఎన్నికైన సురభి వాణీదేవి కరోనా బారిన పడ్డారు. గత రెండు మూడు రోజులుగా కరోనా లక్షణాలు కనిపించడంతో వైద్య పరీక్షలు చేయించుకోగా పాజిటివ్ అని నిర్ధారణ అయ్యింది. కనుక తాను హోమ్ క్వారెంటైన్‌లో ఉన్నానని, గత 10 రోజులలో తనను కలిసినవారందరూ అవసరమైతే కరోనా పరీక్షలు చేయించుకోవాలని ఆమె విజ్ఞప్తి చేశారు.