సంబంధిత వార్తలు

మంచిర్యాల జిల్లాలోని కాశిపేట మండలంలోని మలకపల్లిలో ఈరోజు తెల్లవారుజామున ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకొన్నారు. అప్పుల బాధలు భరించలేక జాంజిరాల రమేష్ (40), పద్మ (35) దంపతులు, వారి కుమార్తె సౌమ్య (19), కుమారుడు అక్షయ కుమార్ (17) ఆత్మహత్య చేసుకొన్నారు. తల్లితండ్రులు ఇద్దరో ఓ గదిలో, అక్కా తమ్ముళ్ళు ఇద్దరు మరో గదిలో ఉరివేసుకొన్నారు. సమాచారం అందుకొన్న పోలీసులు అక్కడకు చేరుకొని కేసు నమోదు చేసుకొని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు.