వరంగల్‌ కాకతీయ యూనివర్సిటీ వద్ద ఉద్రిక్త పరిస్థితులు

కరోనా కారణంగా నేటి నుంచి వరంగల్‌ కాకతీయ యూనివర్సిటీ హాస్టల్స్ను మూసివేస్తున్నట్లు యూనివర్సిటీ రిజిస్ట్రార్ ప్రకటించిన తరువాత పరీక్షలు మాత్రం యధాతధంగా జరుగుతాయని యూనివర్సిటీ కంప్ర్టోలర్ ప్రకటిచడంతో యూనివర్సిటీ విద్యార్ధులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ర్యాలీ నిర్వహిస్తున్నారు. సిఎం డౌన్‌..డౌన్‌...అని నినాదాలు చేస్తూ సిఎం కేసీఆర్‌ దిష్టిబొమ్మను దగ్దం చేయడంతో వారిని అడ్డుకొనేందుకు పోలీసులు ప్రయత్నించారు. విద్యార్దులను పోలీస్ వాహనాలలో ఎక్కించుకొని స్టేషన్‌కు తరలించేందుకు ప్రయత్నిస్తుండటంతో విద్యార్దులు ఆగ్రహం కట్టలుతెంచుకొంటోంది. దీంతో ప్రస్తుతం కాకతీయ యూనివర్సిటీ వద్ద ప్రస్తుతం తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. యూనివర్సిటీ అధికారుల మద్య సమన్వయలోపంతోనే ఈ సమస్య తలెత్తినట్లు అర్ధమవుతోంది. హాస్టల్స్ మూసివేసి విద్యార్దులను ఇళ్లకు వెళ్లిపోవాలని చెప్పినప్పుడు పరీక్షల గురించి వెంటనే ప్రకటన చేయకుండా ఉంటే సరిపోయేది. కానీ పరీక్షలు యధాతధంగా జరుగుతాయని ప్రకటించడంతో హాస్టల్స్ మూసివేస్తే తమ పరిస్థితి ఏమిటని విద్యార్దులు ప్రశ్నిస్తున్నారు.