సంబంధిత వార్తలు

ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్ రావత్ నిన్న తన పదవికి రాజీనామా చేయడంతో ఆయన స్థానంలో గడ్వాల్ ఎంపీ తీరత్ సింగ్ రావత్‌ను బిజెపి అధిష్టానం ఎంపిక చేసింది. ఈరోజు ఉదయం డెహ్రాడూన్‌లోని బిజెపి కార్యాలయంలో సమావేశమైన బిజెపి ఎమ్మెల్యేలు అధిష్టానం సూచన మేరకు తీరత్ సింగ్ రావత్‌ను శాసనసభాపక్ష నాయకుడిగా ఎన్నుకొన్నారు. కనుక ఆయన ముఖ్యమంత్రి పదవి చేపట్టడం లాంఛనప్రాయమే. ఈరోజు ఆయన గవర్నర్ బేబీ రాణీ మౌర్యను కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు సంసిద్దతను తెలియజేస్తారు. కనుక నేడో రేపో తీరత్ సింగ్ ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు.