తెలంగాణ ఉద్యోగులకు 29 శాతం ఫిట్‌మెంట్‌?

తెలంగాణ ప్రభుత్వోద్యోగులు, ఉపాధ్యాయులకు 29 శాతం ఫిట్‌మెంట్‌ లభించబోతోంది. ఈవిషయం ఉద్యోగ సంఘాల నేతలే మీడియాకు తెలియజేశారు. మంగళవారం ఉదయం టీఎన్జీవో, టీజీవో, పీఆర్టీయు నేతలు ప్రగతి భవన్‌కు వెళ్ళి సిఎం కేసీఆర్‌ను కలిసినప్పుడు ఆయన చెప్పిన విషయాలను వారు మీడియాకు తెలియజేశారు. వారు చెప్పినదాని ప్రకారం... 

• ఈసారి వేతనసవరణలో  29 శాతం ఫిట్‌మెంట్‌ ఇస్తామని సిఎం కేసీఆర్‌ చెప్పారు. 

• వేతన సవరణకు బడ్జెట్‌లో కేటాయింపు జరుగుతుంది. 

• పదవీ విరమణ వయసు 61 ఏళ్ళకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని, మార్చి నెల నుంచే దానిని అమలుచేస్తామని చెప్పారు.

• 2003-04 సీపీఎస్ ఉద్యోగుల కుటుంబాలకు కూడా పెన్షన్ పధకం వర్తింపజేస్తామని సిఎం కేసీఆర్‌ హామీ ఇచ్చారు. 

• ఏపీలో పనిచేస్తున్న తెలంగాణ ఉద్యోగులను వెనక్కు రప్పిస్తామని హామీ ఇచ్చారు. 

• ఉపాధ్యాయులకు త్వరలోనే పదోన్నతులు కల్పిస్తామని చెప్పారు.  

• అవుట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగులకు త్వరలోనే జీతాలు పెంచుతామని సిఎం కేసీఆర్‌ హామీ ఇచ్చారు. 

• ప్రాధమిక పాఠశాలలో ఖాళీగా ఉన్న ప్రధానోపాధ్యాయుల పోస్టులను ప్రభుత్వం త్వరలోనే భర్తీ చేస్తుంది.

• పాఠశాలలో అవుట్ సోర్సింగ్ పద్దతిలో పారిశుద్య సిబ్బందిని నియమిస్తుంది. 

• రాష్ట్రంలో ఎన్నికల ప్రక్రియ పూర్తవగానే 50,000 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు జారీ చేస్తుంది.