
వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణను నిరసిస్తూ నేడు ఆంధ్రప్రదేశ్ బంద్‌కు జరుగుతోంది. దీనికి బిజెపి తప్ప రాష్ట్రంలో అన్ని పార్టీలు మద్దతు తెలిపాయి. అధికార వైసీపీ... ఏపీ ప్రభుత్వం కూడా బంద్‌కు మద్దతు ప్రకటించాయి. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణను వ్యతిరేకిస్తున్న జనసేన పార్టీ బిజెపితో స్నేహం కొనసాగిస్తున్నందున బంద్‌కు మద్దతు తెలుపలేదు కానీ విశాఖలోని జనసేన పార్టీ నేతలు, కార్యకర్తలు బంద్‌లో పాల్గొంటున్నారు.
బంద్ కారణంగా ఏపీలో ఆర్టీసీ బస్సులు డిపోలలోనే ఉండిపోయాయి. అధికార, ప్రతిపక్షాలు, రాష్ట్ర ప్రభుత్వం కూడా మద్దతు ప్రకటించినందున ఈరోజు నిర్వహిస్తున్న బంద్ విజయవంతం అయ్యే అవకాశాలే ఎక్కువ. ఏపీలో నేడు బంద్ కొనసాగుతోంది కనుక ఇవాళ్ళ తెలంగాణ నుంచి ఏపీకి వెళ్ళాలనుకొనేవారు తదనుగుణంగా ప్రయాణంలో మార్పు చేసుకోవడం మంచిది.