తెలంగాణ ఐ‌ట్‌ శాఖ మంత్రి కేటీఆర్‌కు స్కోచ్ అవార్డ్

రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌కు స్కోచ్ గ్రూపు బెస్ట్ పెర్ఫార్మింగ్ ఐటి మినిస్టర్-2020 అవార్డు లభించింది. స్కోచ్ గ్రూపు 2003 సంవత్సరం నుండి ఈ అవార్డులు ఇస్తోంది. కరోనా కష్టకాలంలో నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉన్న తెలంగాణ ఐటీశాఖ మంత్రి కేటీఆర్‌కు ఈ అవార్డు ఇస్తున్నట్లు స్కోచ్ గ్రూప్ తెలిపింది. అలాగే రాష్ట్రానికి ఈ-గవర్నెన్స్ డేట్ ఆఫ్ ది ఇయర్-2020 అవార్డు కూడా లభించింది.