
టిఆర్ఎస్ సీనియర్ నేత గోవర్ధన్ రెడ్డి ఇళ్ళలో నేడు ఆదాయపు పన్ను శాఖ అధికారులు సోదాలు చేశారు. ఈరోజు ఉదయం నుంచి ఒకే సమయంలో సంగారెడ్డి, గుమ్మడిదలలోని గోవర్ధన్ రెడ్డి రెండు ఇళ్ళు, రెండు పరిశ్రమలతో పాటు హైదరాబాద్ ఉంటున్న ఆయన బందువుల ఇళ్ళలో కూడా ఆదాయపు పన్ను శాఖ అధికారులు సోదాలు చేస్తున్నారు. ఇంకా సోదాలు కొనసాగుతున్నాయి. అధికార పార్టీకి చెందిన సీనియర్ నేత ఇళ్ళలో ఇంత హటాత్తుగా ఆదాయపు పన్ను శాఖ అధికారులు ఎందుకు సోదాలు చేస్తున్నారు?వారి లెక్కల ప్రకారం ఆయన ఆదాయ వ్యవహారాలపై ఏవైనా అనుమానాలతో సోదాలు నిర్వహిస్తున్నారా...లేదా దీనివెనుక ఏవైనా రాజకీయ ప్రమేయం ఉందా? అనే విషయం త్వరలో బయటపడే అవకాశం ఉంది.