
నిజామాబాద్ జిల్లాలో బోధన్ పట్టణంలో 72 మంది నకిలీ దృవపత్రాలతో పాస్‌పోర్టులు పొందినట్లు సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ స్వయంగా మీడియాకు తెలిపారు. ఈ వ్యవహారంపై మంగళవారం ఆయన ప్రెస్‌మీట్ పెట్టి వివరణ ఇచ్చారు.
“బోధన్ పాస్‌పోర్ట్ వ్యవహారంలో లోతుగా దర్యాప్తు జరిపిన తరువాత పట్టణంలో ఏడు వేర్వేరు చిరుమాలతో మొత్తం 72 మంది నకిలీ దృవపత్రాలతో పాస్‌పోర్టులు పొందినట్లు గుర్తించాము. వాటిలో ఒకే చిరునామాపై 32 పాస్‌పోర్టులు పొందినట్లు గుర్తించాము. ఈవిదంగా నకిలీ దృవపత్రాలతో పాస్‌పోర్టులు పొందిన 8 మందిని, ఈ వ్యవహారంలో ప్రధాన సూత్రధారి నీతై దాస్ అలియాస్ సంజీబ్ దుట్టలను అరెస్ట్ చేశాము. ఈ వ్యవహారంలో ఒక ఎస్సై, ముగ్గురు ఏఎస్సైలను కూడా అరెస్ట్ చేశాము. మరికొంతమంది పరారీలో ఉన్నారు. త్వరలోనే వారిని కూడా అరెస్ట్ చేస్తాము. గత నెలలో బాంగ్లాదేశ్‌కు చెందిన ముగ్గురు వ్యక్తులు ఈవిదంగా పాస్‌పోర్టులు పొందినట్లు గుర్తించడంతో లోతుగా దర్యాప్తు చేయడంతో ఇదంతా బయటపడింది,” అని చెప్పారు.