
పుదుచ్చేరి ముఖ్యమంత్రి నారాయణ స్వామి ఈరోజు తన పదవికి రాజీనామా చేశారు. గడచిన పది రోజులో కాంగ్రెస్ పాలిత పుదుచ్చేరి ప్రభుత్వంలో అనూహ్యమైన రాజకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. వరుసగా ఆరుగురు ఎమ్మెల్యేలు రాజీనామాలు చేయడంతో ఆయన ప్రభుత్వం మైనార్టీలో పడింది. పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్‌గా ఇటీవల అదనపు బాధ్యతలు స్వీకరించిన తమిళ సై సౌందరరాజన్ నారాయణ స్వామి ప్రభుత్వాన్ని ఈరోజు అసెంబ్లీలో బల నిరూపణ చేసుకోవాలని ఆదేశించారు. ఈ నేపథ్యంలోనే సోమవారం పుదుచ్చేరి అసెంబ్లీ ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. కానీ బలనిరూపణకు ముందే పుదుచ్చేరి ముఖ్య మంత్రి నారాయణ స్వామి రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నర్‌కు తన రాజీనామా సమర్పించారు. పుదుచ్చేరిలో మళ్ళీ పూర్తిస్థాయి ప్రభుత్వం ఏర్పడేవరకు తాత్కాలిక ముఖ్యమంత్రిగా కొనసాగవలసిందిగా గవర్నర్ తమిళ సై సౌందరరాజన్ నారాయణ స్వామిని కోరారు.